డిటెక్టివ్ శోధన


Wed,September 20, 2017 11:07 PM

Vishal
విశాల్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం తుప్పరివాలన్. మిస్కిన్ దర్శకత్వం వహించారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో నిర్మాత జి.హరి డిటెక్టివ్ పేరుతో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా కథానాయికలు. అక్టోబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నిర్మాత మాట్లాడుతూ యాక్షన్ అంశాలకు వినోదాన్ని మేళవించి ఆద్యంతం ఉత్కంఠభరితంగా తెరకెక్కించాం. వృత్తినిర్వహణలో సవాళ్లను ఇష్టపడే ఓ డిటెక్టివ్ కథ ఇది.

ఓ హత్యకేసును ఛేదించే క్రమంలో అతడికి ఎదురైన సంఘటనలు అలరిస్తాయి. ఆసక్తికరమైన మలుపులతో థ్రిల్‌ను కలిగిస్తుంది. తమిళంలో మొదటి వారంలోనే 30 కోట్ల వసూళ్లను సాధించింది. విశాల్ కెరీర్‌లోనే అత్యధిక ప్రారంభ వసూళ్లను సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. ప్రసన్న, భాగ్యరాజ్, సిమ్రాన్, వినయ్, జాన్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: అరోల్ కొరెల్లి, ఛాయాగ్రహణం: కార్తిక్ వెంకట్రామన్, మాటలు: రాజేష్.ఏ.మూర్తి.

182

More News

VIRAL NEWS