తులసి కృష్ణ ప్రేమాయణం


Wed,April 24, 2019 11:43 PM

Thulasi Krishna releases caricatures

సంచారి విజయ్‌కుమార్, మేఘాశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం తులసి కృష్ణ. ఎస్.ఏ.ఆర్ దర్శకుడు. యం.నారాయణ, శ్రీమతి నాగలక్ష్మి నిర్మించారు. ఈ చిత్ర గీతాల్ని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. తొలి ప్రతిని దర్శకుడు సాగర్ స్వీకరించారు. కనులతో కూడిన ప్రేమకన్నా మనసుతో ముడిపడిన ప్రేమ గొప్పదనే పాయింట్‌తో రూపొందిన చిత్రమిదని సాగర్ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ కన్నడంలో కృష్ణతులసి పేరుతో రూపొందిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఓ అంధుడికి సాధారణ యువతికి మధ్య సాగే ప్రేమకథా చిత్రమిది. ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది అని తెలిపారు.

1139

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles