డార్లింగ్...సర్‌ప్రైజ్


Mon,May 20, 2019 11:36 PM

This is the Saro Surprise that Prabhas will be giving

హాయ్ డార్లింగ్స్ ఎలా ఉన్నారు? మంగళవారం మీకో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అదేమిటో నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చూసి తెలుసుకోండి అంటూ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ అందించబోయే ఆ సర్‌ప్రైజ్ ఏమిటో తెలుసుకోవాలని అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకుడు. శ్రద్ధాకపూర్ కథానాయిక. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన న్యూలుక్ పోస్టర్‌ను మంగళవారం ప్రభాస్ విడుదల చేయబోతున్నారు. బాహుబలి-2 అఖండ విజయం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

సాహో చాప్టర్-1, చాప్టర్-2 పేరుతో ఇప్పటికే విడుదల చేసిన మేకింగ్ వీడియోలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ప్రభాస్ మరో సర్‌ప్రైజ్‌కు సిద్ధమవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. దాదాపు 300 కోట్ల భారీ వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

4098

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles