ముసుగుల రహస్యాలు


Tue,May 14, 2019 01:13 AM

this is not a love story but a life story suneel kumar reddy

ముసుగుల వెనుక దాగివున్న నిజాల్ని ఆవిష్కరించే చిత్రమిది. వ్యసనం ఏదైనా దాని పర్యవసానాలు మాత్రం వినాశనానికే దారితీస్తాయనే పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రం యువతతో పాటు అన్ని వర్గాల వారిని అలరిస్తుంది అని అన్నారు పి.సునీల్‌కుమార్‌రెడ్డి. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం రొమాంటిక్ క్రిమినల్స్. యెక్కలి రవీంద్రబాబు, బి.బాపిరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనోజ్‌నందం, వినయ్‌మహదేవ్, అవంతిక, మౌనిక ప్రధాన పాత్రలను పోషించారు. ఈ నెల 17న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ ఒక రొమాంటిక్ క్రైమ్‌కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ చిత్రాలకు సీక్వెల్‌గా రూపొందించిన చిత్రమిది. మత్తు పదార్థాలకు యువత ఎలా బానిసలుగా మారుతున్నారో చూపిస్తున్నాం అని చెప్పారు. సమాజంలోని ప్రధాన సమస్యను చర్చిస్తూ రూపొందిన చిత్రమిదని, వినోదంతో పాటు అంతర్లీనంగా మంచి సందేశం ఉంటుందని మనోజ్‌నందం పేర్కొన్నారు.

749

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles