అవినీతిపై సమరం


Tue,March 12, 2019 12:11 AM

The top director of the question is the son of the producer

సమాజంలోని అవినీతిని ప్రశ్నించే ఓ విద్యార్థి నాయకుడి జీవనగమనానికి దృశ్యరూపమే మా చిత్రం అని అన్నారు రాజా వన్నెంరెడ్డి. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ప్రశ్నిస్తా. మనీష్‌బాబు హీరోగా పరిచయం అవుతున్నారు. సత్యారెడ్డి నిర్మిస్తున్నారు. అక్షిత, హసీన్, షిప్రాకౌర్ కథానాయికలు. ఈ నెలాఖరున సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు మాట్లాడుతూ కమర్షియల్ హంగులతో సాగే సందేశాత్మక చిత్రమిది. యువతలో మార్పును తీసుకొచ్చేందుకు ఓ నాయకుడు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు? రాజకీయ ఒత్తిడులను ఎదుర్కొని తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఆకట్టుకుంటుంది. అంతర్లీనంగా అందమైన ప్రేమకథ మిళితమై ఉంటుంది. వెంగీ అందించిన బాణీలకు చక్కటి స్పందన లభిస్తున్నది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం అని తెలిపారు. రావురమేష్, ఆమని, వేణుగోపాల్, ప్రభాస్‌శ్రీను, అనంత్, శివపార్వతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ: పి. రాజేంద్రకుమార్, సంగీతం: వెంగీ, సినిమాటోగ్రఫీ: ఎన్.సుధాకర్‌రెడ్డి.

521

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles