విఐ ఆనంద్ దర్శకత్వంలో..


Fri,November 9, 2018 12:13 AM

The title logo poster of Ravi Teja next with Vi Anand to Be Unveiled On november 13

రవితేజ కథానాయకుడిగా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా ఈ చిత్ర టైటిల్ లోగోను ఈ నెల 13న ప్రకటించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు విఐ ఆనంద్ చెప్పిన కథ అద్భతంగా వుంది. రవితేజ ఇంత వరకు చేయని కొత్త జోనర్ చిత్రమిది. ఓ సైంటిఫిక్ కథతో మా సంస్థ విలువను మరింత పెంచే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ఈ చిత్రానికి కొన్ని క్రేజీ టైటిల్స్ అనుకుంటున్నాం. అందులో ఒకదాన్ని ఈ నెల 13న ఖరారుచేసి టైటిల్ లోగోను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

2250
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles