బాలీవుడ్‌లో అరంగేట్రం


Sat,April 13, 2019 01:00 AM

The Pride of India Read the true story of Ajay Devgn film on  helped IAF

అత్తారింటికి దారేది చిత్రంతో బాపు బొమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్నది ప్రణీత. ఈ సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్న ఆమె ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు చేసింది. కథ, కథనాలతో పాటు పాత్రల్లో కొత్తదనం లోపించడంతో ఈ సినిమాలన్నీ ప్రణీతకు నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం కథానాయికగా పూర్వవైభవాన్ని సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న ఈ సొగసరి తాజాగా బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నది. అజయ్‌దేవ్‌గన్ కథానాయకుడిగా 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది.

యుద్ధ సమయంలో భుజ్ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్థాన్ బాంబు దాడులను ధైర్యంగా ఎదురించి పోరాడిన విజయ్ కర్నిక్ అనే ఐఏఎఫ్ కమాండర్ స్ఫూర్తిదాయక గాథ ఆధారంగా దర్శకుడు అభిషేక్ దుదయ్యా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రణీత నటించనున్నది. నటనకు ఆస్కారమున్న శక్తివంతమైన పాత్ర కావడంతో బాలీవుడ్ అరంగేట్రానికి ప్రణీత ఈ చిత్రాన్ని ఎంచుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అజయ్‌దేవ్‌గణ్‌తో పాటు సంజయ్‌దత్, సోనాక్షిసిన్హా, రానా, పరిణీతి చోప్రా కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.

692

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles