జయలలిత ది ఐరన్ లేడీ


Fri,September 21, 2018 11:29 PM

The Iron Lady First Look of Film on J Jayalalithaa Revealed

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరపైకి రానుందంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పేపర్ టేల్ పిక్చర్స్ పతాకంపై ప్రియదర్శిని రూపొందించనున్న ఈ చిత్రానికి ది ఐరన్ లేడీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర టైటిల్ లోగోను గురువారం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ విడుదల చేశారు. జయలలిత బయోపిక్‌కు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది. ప్రియదర్శిని, చిత్ర బృందం విజయం సాధించాలి అని మురుగదాస్ పేర్కొన్నారు. జయలలిత పాత్రలో నిత్యామీనన్ లేదా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించే అవకాశం వుందని తెలిసింది. తమిళనాడు ప్రజల హృదయాల్లో అమ్మగా చెరగని ముద్ర వేసుకున్న జయలలిత రాజకీయ, సినీ ప్రస్థానంలోని కీలక ఘట్టాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది.

1800

More News

VIRAL NEWS

Featured Articles