జీరో డిగ్రీ ఉష్ణోగ్రతలో..


Tue,September 11, 2018 02:57 AM

The Fog Telugu Movie Trailer Relese

విరాట్ చంద్ర, హరిణి, చందన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ది ఫాగ్. మధుసూదన్ దర్శకుడు. ఎమ్.వి.రెడ్డి నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ బాగుంది. సాంకేతికత, నాణ్యత పరంగా పెద్ద సినిమా అనుభూతిని కలిగించింది. జీరో డిగ్రీ ఉష్ణోగ్రతలో హాలీవుడ్ శైలిలో ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. దర్శకుడు మధుసూదన్‌తో పాటు యూనిట్‌కు ఈ చిత్రం మంచి పేరుతెచ్చిపెట్టాలి అని తెలిపారు. మర్డర్, మిస్టరీ, హారర్ అంశాలు మిళితమైన చిత్రమిది. కొండ ప్రాంతంలో జరుగుతున్న వరుస హత్యల వెనకున్న రహస్యాన్ని ఓ యువకుడు ఎలా ఛేదించాడన్నదే చిత్ర కథ. ఊహకందని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది అని దర్శకుడు చెప్పారు. ఆత్మానంద, ప్రణీత, సతీష్‌రెడ్డి, చందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హరినాథ్, సతీష్‌రెడ్డి, సంగీతం: సందీప్.

2539

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles