తాగి తందనాలాడితే

Fri,November 8, 2019 11:55 PM

ఆదిత్, సప్తగిరి, మధునందన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం తాగితే తందానా. శ్రీనాథ్ బాదినేని దర్శకుడు. వి.మహేష్, వినోద్ జంగపల్లి నిర్మిస్తున్నారు. సిమ్రాన్ గుప్తా, రియా కథానాయికలు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, బ్యానర్ లోగోను చిత్రబృందం గురువారం హైదరాబాద్‌లో విడుదలచేసింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు మారుతి మాట్లాడుతూ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. దర్శకనిర్మాతలు కొత్త ఆలోచనలతో ఈ సినిమాను తెరకెక్కించిన అనుభూతి కలుగుతున్నది. ఆదిత్, మధు, సప్తగిరి పాత్రలు బాగున్నాయి అని తెలిపారు. ఈ సినిమాకు మంచి టైటిల్ కుదిరింది అని ఆదిత్ పేర్కొన్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలుపుతూ తాగిన మత్తులో ఓ ముగ్గురు కుర్రాళ్లు సమస్యలో పడతారు. ఆ ఉపద్రవం నుంచి బయటపడే క్రమంలో ఎదురయ్యే సంఘటనలు వినోదాన్ని పంచుతాయి. ఒక పాట, ప్యాచ్ వర్క్ మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం అన్నారు.

412

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles