అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది!

Mon,November 11, 2019 12:21 AM

సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, రూపా జగదీష్, ఇందుమూరి శ్రీనివాసులు నిర్మాతలు. ఈ నెల 15న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్ర ప్రిరిలీజ్ వేడుక శనివారం ఏపీలోని కర్నూలులో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ హాస్యం, సందేశం మేళవించిన కథాంశమిది. సందీప్‌కిషన్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది. ఆద్యంతం వినోదప్రధానంగా అందరిని ఆకట్టుకుంటుంది అన్నారు. నా కెరీర్‌లో ఇలాంటి సమయంలో నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. నా సినీ ప్రయాణంలో వైవిధ్యభరితమైన చిత్రంగా మిగిలిపోతుంది అని సందీప్‌కిషన్ చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ కర్నూలులో 18రోజుల పాటు చిత్రీకరణ చేశాం. సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాం అన్నారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు సాయికార్తీక్ తెలిపారు. హన్సిక, వరలక్ష్మిశరత్‌కుమార్, మురళీశర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరాం, కథ: టి.రాజసింహ, సంభాషణలు: నివాస్, భవానీప్రసాద్, స్క్రీన్‌ప్లే: రాజు, గోపాలకృష్ణ, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

329

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles