పాతబస్తీ దాస్


Mon,May 20, 2019 11:34 PM

Telugu film Falaknuma Das to release on May 31

మంచి సినిమాలు తీయాలనే సంకల్పంతో నవతరం దర్శకులు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. విశ్వక్‌సేన్ ఈ సినిమాతో అదే ప్రయత్నం చేశారు. తెలుగు తెరపై ఎవరూ స్పృశించని సరికొత్త కథాంశమిది అని అన్నారు నిర్మాత సురేష్‌బాబు. విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఫలక్‌నుమా దాస్. కరాటే రాజు, చర్లపల్లి సందీప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి చారులింగ కథానాయికలు. సురేష్ బాబు విడుదలచేస్తున్నారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ పాతబస్తీకి చెందిన దాస్ అనే యువకుడి జీవితగమనానికి దృశ్యరూపమిది. సినిమా చూసినవాళ్లంతా బాగుందని ప్రశంసిస్తున్నారు.

యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది అని తెలిపారు. హైదరాబాద్ సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిదని నిర్మాత అన్నారు. తరుణ్‌భాస్కర్ మాట్లాడుతూ ఇందులో నేను ఓ కీలక పాత్రను పోషించాను. నిత్యజీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలు, అనుబంధాలన్నీ ఇందులో కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు తమ జీవితాల్ని దర్శించుకుంటారు. మలయాళంలో రూపొందిన అంగమలై డైరీస్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం వినూత్నంగా ఉంటుంది అని చెప్పారు. సినిమాలో సంభాషణలు సహజంగా ఉన్నాయి. వాణిజ్య విలువలు మేళవిస్తూ చక్కటి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు అని సురేష్‌బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సలోని మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

1267

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles