బిలాల్‌పూర్‌లో ఏం జరిగింది?


Tue,March 12, 2019 12:13 AM

telugu events bilalpur police station pre release event

మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన జంటగా నటిస్తున్న చిత్రం బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్. నాగసాయి మాకం దర్శకుడు. మహంకాళీ శ్రీనివాస్ నిర్మాత. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ చిన్ననాటి నుంచి నాకు సాహిత్యాభిలాష ఉంది. కవిత్వం రాస్తూ ఉండేవాడిని. తొలుత దర్శకుడు కావాలని హైదరాబాద్ వచ్చాను. ఇక్కడి కష్టాలు చూసి తిరిగి వెళ్లిపోయాను. ఆ తర్వాత వ్యాపార రంగంలో స్థిరపడ్డాను. అయితే దర్శకుడు కావాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. అది ఈ సినిమాతో నెరవేరింది అన్నారు. నాకు సినిమాల్లో నటించడం అంతగా ఆసక్తి ఉండదు.

ఈ చిత్ర నిర్మాత మహంకాళీ శ్రీనివాస్ విలువలు తెలిసిన వ్యక్తి. అందుకే నటించేందుకు ఒప్పుకున్నాను. ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు అని గోరటి వెంకన్న తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ సందేశాత్మక ఇతివృత్తంతో ఆద్యంతం హాస్యరసభరితంగా సాగే చిత్రమిది. బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

948

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles