లిప్‌లాక్ చేయని ఏకైక హీరోయిన్ నేనే!


Sun,June 2, 2019 11:55 PM

telugu beauty pujita ponnada interview about havish 7 movie

వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ చిత్రంలో నటించాల్సింది కాదు. నాకు ముందు చెప్పిన కథ ఒకటి. ఆ తరువాత క్రమ క్రమంగా తీసింది మరొకటి. రొమాంటిక్ సన్నివేశం అని చెప్పి నాతో లిప్‌లాక్ చేయించారు. ఈ సినిమా అనుభవంతో ఎలాంటి చిత్రాలు చేయాలి? ఎలాంటివి చేయకూడదన్న స్పష్టమైన అవగాహన ఏర్పడింది అన్నారు పూజితా పొన్నాడ. ఆమె నటిస్తున్న తాజా చిత్రం సెవెన్. హవీష్ కథానాయకుడు. నిజార్ షఫీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో పూజితా పొన్నాడ పాత్రికేయులతో ముచ్చటించారు.

సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఓ సంస్థలో పనిచేస్తున్న నాకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. స్నేహితుల ప్రోత్సాహంతో పలు లఘు చిత్రాల్లో నటించాను. ఈ విషయం తెలిసి మా కుటుంబ సభ్యులు తొలుత షాక్‌కు గురయ్యారు. ఆ తరువాత షార్ట్ ఫిల్మ్స్‌లో నా నటన చూసి ప్రోత్సహించడం మొదలుపెట్టారు. నేను నటించిన ఓ షార్ట్ ఫిల్మ్ చూసిన దర్శకుడు సుకుమార్ తను నిర్మిస్తున్న దర్శకుడు చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో నా సినీ ప్రయాణం మొదలైంది. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలంలో ప్రకాష్‌రాజ్ కూతురిగా, హీరో ఆది పినిశెట్టికి జోడీగా నటించాను.

సెవెన్ ఒక రొమాంటిక్ థ్రిల్లర్..

ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. సినిమాలో నా పాత్ర చాలా సస్పెన్స్. దాన్ని ఇప్పుడే రివీల్ చేయలేను. ఇప్పటి వరకు వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా సాగుతుంది. సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలకు నాకు సంబంధించిన కథలో కొన్ని సమాధానాలుంటాయి. అవేంటనేది తెరపైన చూడాల్సిందే. సినిమాలో నా పాత్ర బోల్డ్‌గా వుండదు కానీ కొత్తగా మాత్రం వుంటుంది. సినిమాలో నాది ఓ ప్రేమకథ. ఇందులో ఎక్కువ మంది హీరోయిన్‌లు వున్నా ఎవరి కథ వారిదే. ఒకరి కథతో మరొకరికి సంబంధం వుండదు. అయితే నాకు రెజీనాతో కొన్ని సన్నివేశాలుంటాయి. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు సాధారణంగా వుంటాయి. కానీ ఇది రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుంది. కథ కొత్తగా అనిపించింది. అందుకే అంగీకరించాను. ఈ సినిమాలో లిప్‌లాక్ లేని ఏకైక హీరోయిన్ నేనే.

హీరోయిన్ కావాలని అనుకోలేదు..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే సరదాగా లఘు చిత్రాల్లో నటించాను. దర్శకుడు తరువాత చేసిన రంగస్థలం సినిమాతో హీరోయిన్‌ని కావాలి అని బలంగా అనుకున్నాను. సోలో హీరోయిన్‌గా మంచి చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నాను. ప్రతి జోనర్‌లోనూ ఓ సినిమా ప్రయత్నించాలి. నటిగా నా ప్రతిభను నిరూపించుకోవాలనుకున్నాను. నటన నేర్చుకుని సినిమాల్లోకి రాలేదు. ఎంత శ్రమించినా అదృష్టం కలిసిరావాలి.

తదుపరి చిత్రాలు..

రాజశేఖర్ హీరోగా నటిస్తున్న కల్కి చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. గిరిజన యువతిగా కనిపిస్తాను. నా పాత్ర చాలా ట్విస్ట్‌లతో సాగుతుంది. దీనితో పాటు తెలుగులో మరో సినిమా అంగీకరించాను. దానికి సంబంధించిన వివరాల్ని త్వరలో వెల్లడిస్తాను.

5311

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles