విలువల దారి వీడని కళాపిపాసి

Thu,December 12, 2019 11:09 PM

విలువల దారి వీడని కళాపిపాసి


కళ మనిషిలోని అంతఃశక్తులకు ఆలంబనగా, ఓ ప్రతిబింబింలా గోచరిస్తుంది. కళను ఆరాధించి, గొప్ప రసదృష్టితో హృదయంలో నింపుకొని.. బహుముఖీన రూపాల్లో వ్యక్తీకరించుకున్న సినీ, సాహిత్య శ్రేష్టుడు గొల్లపూడి మారుతీరావు. సంపాదకుడిగా మొదలైన ఆయన ప్రయాణం రేడియా వ్యాఖ్యాతగా, నాటక, కథ, నవల, మాటల రచయితగా, సినీనటుడిగా తనదైన ముద్రతో సాగిపోయింది. అనితరసాధ్యమైన వాక్పటిమ, సినీ సాహిత్య రంగాలపై విశేష పరిజ్ఞానం, విశ్లేషణాసామర్థం ఆయన్ని ఓ అసాధారణ ప్రతిభాశీలిగా నిలబెట్టాయి. గొల్లపూడి మారుతీరావు మరణంతో తెలుగు చిత్రసీమ ఓ బహుముఖప్రజ్ఞాశాలిని కోల్పోయినట్లయింది.

పత్రికారంగం నుంచి ప్రయాణం మొదలు..

ల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అన్నపూర్ణ, సుబ్బారావు ఆయన తల్లిదంవూడులు. విశాఖపట్నంలోని సీబీఎం ఉన్నత పాఠశాల, ఎవీఎన్ కళాశాల, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం చేశారు. బీయస్‌సీ (ఆనర్స్)లో ఉత్తీర్ణుడయ్యారు. 1959లో ఆంధ్రవూపభ దినపవూతిక ఉపసంచాలకుడిగా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. అనంతరం కొత్తగా ప్రారంభించిన చిత్తూరు ఎడిషన్‌లో సంపాదక వర్గంలో పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలానికి పత్రికారంగం నుంచి తప్పుకొని రేడియో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేశారు. ఆ తర్వాత పదోన్నతి పొంది సంబల్‌పూర్, చ్నై, కడప కేంద్రాల్లో పనిచేశారు. కడప కేంద్రంలో రెండు దశాబ్దాలు సేవలందించారు. చివరకు అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ హోదాలో పదవీవిరమణ చేశారు.

నాటకాలకు దర్శకత్వం..

కాలేజీ రోజుల్లోనే రాఘవ కళానికేతన్ పేరుతో నాటక బృందాన్ని నడిపారు మారుతీరావు. ‘ఆడది’ ‘కుక్కపిల్ల దొరికింది’ ‘స్వయంవరం’ ‘రిహార్సల్స్’ ‘వాపస్’ ‘మహానుభావులు’ నాటకాల్ని నిర్మించి దర్శకత్వం వహించారు. వాటిలో ప్రధాన పాత్రధారిగా నటించారు. విద్యార్థి దశలోనే స్నానాలగది, మనస్తత్వాలు నాటకాల్లో అభినయించారు. చైనా దురాక్షికమణపై తెలుగులో మొట్టమొదటి నాటకం ‘వందేమాతరం’ను రచించి చిత్తూరు, మదనపల్లె, నగరిలో ప్రదర్శించారు. తద్వారా వచ్చిన 50వేల నిధుల్ని ప్రధాన మంత్రి రక్షణనిధికి అందజేశారు. రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించిన ఆ నాటకానికి అప్పటి విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి పీవీ నరసింహారావు ఉపోద్ఘాతం రాశారు. 1959లో ‘రాగరాగిణి’ అనే నాటకాన్ని ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శించారు. మారుతీరావు వివాహం 1961 నవంబర్ 11న శివకామసుందరితో హన్మకొండలో జరిగింది.

maruthi-rao

1963లో సినీరంగ ప్రవేశం..

‘డాక్టర్ చక్రవర్తి’ (1963) చిత్రం ద్వారా స్క్రీన్‌ప్లే రచయితగా గొల్లపూడి సినీరంగ ప్రవేశం చేశారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రం ద్వారా నటుడిగా వెండితెరపై అరంగేట్రం చేశారు. ఇక అక్కడి నుంచి నటుడిగా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించారు. దాదాపు 250కి పైగా చిత్రాల్లో సహాయ నటుడిగా, కమెడియన్‌గా తనదైన విలక్షణ అభినయంతో మెప్పించారు. తనదైన సంభాషణ చాతుర్యం, హావభావాలతో నటుడిగా ప్రత్యేకతను ంపాదించుకున్నారు. ‘సంసారం ఒక చదరంగం’ ‘స్వాతిముత్యం’ ‘తరంగిణి’ ‘త్రిశూలం’ ‘అసెంబ్లీరౌడీ’ ‘ముద్దులవూపియుడు’ ‘ఆదిత్య 369’ వంటి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలకు మంచిపేరు దక్కింది.

కుమారుడి పేరుతో పురస్కారం..

1992లో గొల్లపూడి మారుతీరావు కుమారుడు శ్రీనివాస్ దర్శకుడిగా తొలివూపయత్నంగా ‘ప్రేమపుస్తకం’ అనే సినిమాను ఆరంభించారు. చిత్రీకరణ సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించారు. తన కుమారుడి జ్ఞాపకంగా ‘గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు’ను నెలకొల్పారు. ప్రతి ఏడాది ఉత్తమ తొలి చిత్ర దర్శకుడికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. నగదు బహుమతి క్రింద1.5లక్షల రూపాయల్ని అందిస్తున్నారు. కుమారుడి మరణంతో ‘ప్రేమపుస్తకం’ దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు గొల్లపూడి. ఈ సినిమాకు గాను ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా నంది అవార్డు అందుకున్నారు. కుమారుడి మరణం తన జీవితంలో అతిపెద్ద విషాదమని గొల్లపూడి ఎప్పుడూ చెబుతుండేవారు.

250 సినిమాల్లో..

వైవిధ్యమైన నటనకు చిరునామాగా నిలిచారు గొల్లపూడి మారుతీరావు. ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా దాదాపు 250కిపైగా చిత్రాల్లో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మధ్యతరగతి వ్యక్తిగా, స్త్రీలోలుడిగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెప్పించారు గొల్లపూడి. అదే సమయంలో బాధ్యతలు చాటిచెప్పే ఉదాత్తమైన పాత్రలకు ప్రాణం పోశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన పాత్ర పరిధి మేరకే ఆలోచించకుండా ఎన్నో సినిమాల్ని తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించి విజయవంతం చేశారాయన. సంసారం ఒక చదరంగం, డబ్బెవరికి చేదు, ముక్కుపుడక చిత్రాలే అందుకు ఉదాహరణ. రావుగోపాలరావుతో పలు సినిమాల్లో పోటీపడి నటించి విలనిజానికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చారు. ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్యలో స్త్రీలోలుడైన కుటిలమనస్తత్వమున్న వ్యక్తిగా ప్రతినాయకఛాయలున్న పాత్రలో తొలి అడుగులోనే తన ముద్రను చాటుకున్నారు. మనిషికో చరిత్ర చిత్రంలో బాధ్యతలు మరచిన భర్తగా కనిపించారు. కెరీర్‌లో మూడో సినిమాలోనే ద్విపావూతాభినయంలో కనిపించి నటుడిగా తన ప్రతిభాసంపత్తులను చాటిచెప్పారు.

‘సంసారం ఒక చదరంగం’ చిత్రంలో కుటుంబ బాధ్యతల కారణంగా సంఘర్షణకు లోనయ్యే కుటుంబ పెద్దగా అసమానమైన నటనను కనబరిచారు గొల్లపూడి మారుతీరావు. ‘స్వాతిముత్యం’ సినిమాలో సాత్వికుడిగా కనిపించే చెడుమనస్కుడిగా, ‘ఛాలెంజ్’ సినిమాలో సిల్క్‌స్మిత భర్తగా ప్రతి సినిమాలో విలనిజాన్ని కొత్త పంథాలో ఆవిష్కరించారు. పాత్ర ఏదైనా అందుకు తగినట్లుగా భావవ్యక్తీకరణ, సంభాషణలు చెప్పే తీరును మార్చుకుంటూ వాటిని పరిపూర్ణంగా న్యాయం చేసేవారు. తరంగిణి, త్రిశూలం, అసెంబ్లీరౌడీ, యముడికి మొగుడు,అభిలాష, ఆలయశిఖరం, పల్లెటూరి మొనగాడు, ప్రేమ, ఛాలెంజ్, ఆదిత్య 369, మురారి, లీడర్, దరువు, రౌడీఫెల్లో, కంచె, మనమంతా, ఇజంతో పాటు పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రల్ని పోషించారు. గొల్లపూడి మారుతీరావు నటించిన చివరి చిత్రం ‘జోడీ’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కెరీర్ ఉన్నతదశలో ఉన్నప్పుడు ఏడాదికి 30కిపైగా సినిమా చేసేవారు గొల్లపూడి. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ కొన్ని సినిమాల్లో నటించారు. బుల్లితెరపై ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరిగోల వారిదే వంటి పలు ధారావాహికల్లో నటించారు.

రచయితగా ప్రత్యేక ముద్ర..

సామాజిక అంశాల్ని, మానవసంబంధాల్ని స్పక్షుశిస్తూ కథల్ని, సంభాషణల్ని రాయడం గొల్లపూడి ప్రత్యేకతగా చెప్పవచ్చు. దేవుడు చేసిన పెళ్లి, దొరబాబు, గోల్కొండ అబ్బులు, కళ్లు, సార్వభౌముడు, జేబుదొంగ చిత్రాలకు కథారచయితగా పనిచేశారు. సంభాషణల రచయితగా యాభైకి పైగా చిత్రాలకు పనిచేశారు. కథ, పాత్రల్ని బట్టి కాకుండా నటులు శైలి, ఇమేజ్‌ను అనుసరించి సంభాషణలు రాసేవారు గొల్లపూడి. నాటకాలరాయుడు, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, ప్రేమబంధం, ఓసీత కథ, అనురాగాలు, నేరం నాది కాదు ఆకలిది, శుభలేఖ, సత్యానికి సంకెళ్లు, ప్రేమతరంగాలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఆలయశిఖరం, శుభసంకల్పం చిత్రాలకు సంభాషణల రచయితగా పనిచేశారు. విభిన్న ఇతివృత్తాలకు మాటల్ని అందించి రచయితగా ప్రత్యేకతను చాటుకున్నారు. పాపం పసివాడు, మరపురాని తల్లి సినిమాలకు కథ, సంభాషణలతో పాటు స్క్రీన్‌ప్లేను అందించారు.

maruthi-rao1

అవార్డులు

గొల్లపూడి మారుతీరావు సినీకళాకారుడిగా, సాహిత్యకారుడిగా ఎన్నో గొప్ప పురస్కారాలను అందుకున్నారు. 1963తో ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాకు స్క్రీన్‌ప్లేను అందించిన గొల్లపూడి తొలివూపయత్నంలోనే నంది అవార్డును అందుకొని ప్రతిభను చాటుకున్నారు. ఆత్మగౌరవం, కళ్లు చిత్రాలకు ఉత్తమ రచయితగా, ‘మస్టారికాపురం’ చిత్రానికిగాను ఉత్తమ సంభాషణల రచయితగా నంది పురస్కరాల్ని సొంతం చేసుకున్నారు.
రామాయణంలో భాగవతం చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా అవార్డు అందుకున్నారు.

maruthi-rao3

సంతాపాలు

గొల్లపూడితో నాకు అవినాభావ సంబంధముంది. గురుశిష్యుల బంధం మాది. ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య, ఆలయశిఖరం, అభిలాష, ఛాలెంజ్‌తో పాటు ఎన్నో సినిమాల్లో నాతో కలిసినటించారాయన. బహుముఖవూపజ్ఞాశాలి, సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటకరచయిత గొల్లపూడి మారుతీరావు మరణించడం చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాకుండా యావత్ సినీ ప్రపంచానికి తీరని లోటు
- చిరంజీవి.

గొల్లపూడి మారుతీరావు హఠార్మరణం బాధించింది. తెలుగు సినీ పరిక్షిశమకు అసమానసేవలుచేశారాయన. ఆణిముత్యాన్ని కోల్పోయాం.
- మహేష్‌బాబు

గొల్లపూడి మారుతీరావు మాట్లాడే విధానం, ఆయన నటన కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటాయి. నాకు ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరు
- నాని

గొల్లపూడి మారుతీరావు ఇకలేరన్న వార్త ఎంతో విషాదాన్ని కలిగించింది. విలక్షణ నటుడు అనే పదానికి ఆయన ఒక ఉదాహరణ
- సుధీర్‌బాబు

509

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles