పైడిజైరాజ్ 110వ జయంతి

Tue,October 1, 2019 12:04 AM

తెలంగాణలోని కరీంనగర్‌లో 1909లో జన్మించిన పైడి జైరాజ్ బాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. సినీరంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్‌ఫాల్కేను సైతం అందుకున్నారు. ఆయన 110వ జయంతి వేడుకలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా రచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ బాలీవుడ్‌లో రెండువందలకు పైగా సినిమాల్లో నటించి అనేక అవార్డులను అందుకున్న మహోన్నత వ్యక్తి చరిత్ర మరుగునపడటం బాధను కలిగించింది అని అన్నారు. జైహింద్‌గౌడ్ మాట్లాడుతూ పైడి జైరాజ్‌కు వీరాభిమానిని నేను. తన అజరామరమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నటుడు. ఆయన 110వ జయంతిని నిర్వహించడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. పైడి జైరాజ్ గొప్ప నటుడు, మానవతా విలువలున్న వ్యక్తి, ఈ జయంతి వేడుకల ద్వారా ఆయన్ని స్మరించుకోవడం, జ్ఞాపకాల్ని పంచుకోవడం సంతోషాన్ని కలిగించిందని పైడి జైరాజ్ మనవరాలు సునీతనాయుడు చెప్పింది. ఈ కార్యక్రమంలో పైడి జైరాజ్ మనవడు ధీరజ్‌నాయుడు, నటుడు రోషం బాలు తదితరులు పాల్గొన్నారు.

227

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles