ఫలక్‌నుమా దాస్ హంగామా!


Thu,February 14, 2019 11:38 PM

Tarun Bhaskar Speech at Falaknuma das Teaser Launch

విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఫలక్‌నుమా దాస్. సలోని మిత్రా, హర్షిత్ గౌర్, ప్రశాంతి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. దర్శకుడు తరుణ్‌భాస్కర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కరాటే రాజు సమర్పణలో వన్మయి క్రియేషన్స్, విశ్వక్‌సేన్ సినిమాస్, టెరనోవా పిక్చర్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో విశ్వక్‌సేన్ తల్లి దుర్గ బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. విశ్వక్‌సేన్ మాట్లాడుతూ వాలంటైన్స్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయడానికి కారణం ఇదే నా గర్ల్‌ఫ్రెండ్. సినిమాకు ఎంత బడ్జెట్ అవసరమో అంత పెట్టాం. చాలా పెద్ద సినిమా ఇది. నిజాయితీగా ఉండేవారికి పొగరు ఎక్కువగా వుంటుంది. హైదరాబాద్‌లో ఎక్కువ మందికి పొగరు వుండేది అందుకే. సెన్సార్ అడ్డంకులకు సిద్ధపడే సినిమా చేశాను. ఈ సినిమా తీసింది నాలాంటి వాళ్ల కోసం.

వాళ్లకు నచ్చుతుంది అన్నారు. తరుణ్‌భాస్కర్ మాట్లాడుతూ ఫలక్‌నుమా ప్రాంతంలోని వాస్తవికతను విశ్వక్‌సేన్ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. అక్కడి భాష, యాసను తెలుగు సినిమా అంగీకరిస్తుందా? అనే అనుమానం వుండేది. నిజాయితీగా తీస్తే ఆదరిస్తారనే విషయం ఇటీవలి కాలంలో రుజువైంది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు పాత్రల్లో లీనమవుతారు అన్నారు. హైదరాబాద్‌లో ఎవరికి తెలియని118 లొకేషన్‌లలో ఈ చిత్రాన్ని రూపొందించాం అని కరాటే రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేక్ సాగర్, కౌశిక్, కిట్టు విస్సాప్రగడ, రాహుల్ సింప్లిగంజ్, యశ్వంత్, ప్రశాంతి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

809

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles