మీకు మాత్రమే చెప్తా!


Sun,February 17, 2019 12:31 AM

tarun bhaskar new makeover in vijay deverakonda production venture

కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో విజయ్ దేవరకొండ స్వీయ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తరుణ్‌భాస్కర్ కథానాయకుడిగా నటిస్తున్నారు. షమ్మీర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లుగా తెలిసింది. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రానికి రూపకల్పన చేశారని సమాచారం. పెళ్లిచూపులు చిత్రం ద్వారా దర్శకుడు తరుణ్‌భాస్కర్, హీరో విజయ్‌దేవరకొండ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. వ్యక్తిగతంగా కూడా వీరిద్దరి మధ్య చక్కటి సాన్నిహిత్యం ఉంది. దీంతో ఈ సినిమా విషయంలో విజయ్‌దేవరకొండ ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారట.
tharun-bhasker
ఇందులో తరుణ్‌భాస్కర్ లుక్స్ కూడా వైవిధ్యంగా ఉంటాయని చెబుతున్నారు. ఎప్పుడూ గడ్డంతో కనిపించే తరుణ్‌భాస్కర్ ఈ సినిమా కోసం క్లీన్‌షేవ్ చేసుకున్నారని, బరువు తగ్గి స్లిమ్‌లుక్‌తో కనిపిస్తారని అంటున్నారు. ఇదిలావుండగా దర్శకత్వంతో పాటు నటుడిగా కూడా రాణిస్తున్నాడు తరుణ్‌భాస్కర్. మహానటి చిత్రంలో సింగీతం శ్రీనివాసరావు పాత్రలో కనిపించారు. త్వరలో విడుదలకాబోతున్న ఫలక్‌నుమా దాస్ చిత్రంలో ఫుల్‌లెంగ్త్ రోల్‌ను పోషించారు. తాజాగా విజయ్‌దేవరకొండ నిర్మించే చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతుండటం విశేషం.

2516

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles