తారామణి సందేశం!


Mon,August 19, 2019 12:06 AM

Taramani Movie Release on Sep 06th

అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం తారామణి. రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అదే పేరుతో ఉదయ్ హర్ష వడ్డెల్ల, డి.వి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇదొక ముక్కోణపు ప్రేమకథ. సినిమాలో ఎమోషనల్ అంశాలతో పాటు అన్ని రకాల అంశాలు సమపాళ్లలో వుంటాయి. నేటి యువత సాంకేతికత మాయలో పడి తమ జీవితాల్ని ఎలా సమస్యల మయం చేసుకుంటున్నారు? తద్వారా ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు? అనే అంశాల నేపథ్యంలో సినిమా సాగుతుంది. యువతకు వినోదాన్ని అందిస్తూనే సందేశాన్నిచ్చే చిత్రమిది. ఈ చిత్ర కాన్సెప్ట్ నచ్చి ట్రైలర్‌ని కమల్‌హాసన్, పాటలను సూపర్‌స్టార్ రజనీకాంత్ విడుదల చేశారు. ట్రైలర్, పాటలకు విశేష స్పందన లభించింది. తమిళంలో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులోనూ అదే తరహాలో ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. కొత్త తరహా చిత్రాల్ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

438

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles