ముఖ చిత్ర సుందరి


Thu,October 12, 2017 11:55 PM

Tapsee Gives Maximum For Maxim

Taapsee
తెలుగు సినిమాలతో కథానాయికగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది తాప్సీ. తమిళంతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో సినిమాలు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో పేరుప్రఖ్యాతులు దక్కకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది. బేబీ, పింక్ చిత్రాల్లో చక్కటి అభినయంతో ఆకట్టుకున్న ఆమెను హిందీలో పలు అవకాశాలు వరిస్తున్నాయి. దక్షిణాదిలో జరిగిన తప్పులు బాలీవుడ్‌లో పునరావృతం కాకుండా జాగ్రత్తపడిన తాప్సీ హిందీలో తొలినాళ్లలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసింది. ప్రస్తుతం తన పంథాను మార్చుకునే పనిలో పడింది. గ్లామర్ బాటను పట్టింది. ఇటీవల విడుదలైన జుద్వా-2లో బికినీతో గ్లామరస్‌గా దర్శనమిచ్చి ఆకట్టుకుంది. తాజాగా ఓ మాస పత్రిక కవర్‌పేజీ కోసం మరోసారి మోతాదుకు మించిన అందాల ప్రదర్శన చేసి వార్తల్లో నిలిచింది. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ దుస్తులు, రెట్రో హెయిర్‌ైస్టెల్‌తో హాట్‌గా కనిపిస్తున్న తాప్సీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. అందాల ప్రదర్శన విషయంలో తనకు ఎలాంటి హద్దులు లేవని ఈ ఫొటోలతో బాలీవుడ్ కు చాటింది.

833

More News

VIRAL NEWS

Featured Articles