వాళ్ల భయం నిజమే!


Thu,November 15, 2018 12:04 AM

Tanish Speech At Rangu Movie Controversial Press Meet

రంగులో నేను లారాగా నటించాను. ఈ విషయంలో లారా కుటుంబ సభ్యుల భయం నిజమే. సమాజంలో ఒక మనిషి ఎలా వుండాలో ఎలా వుండకూడదో చెప్పే సినిమా ఇది. లారా ఐడియాలజీ, ఆలోచనా విధానం అంతా సినిమాలో చూపించాం. సినిమా చూస్తే లారా కుటుంబ సభ్యుల కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అన్నారు తనీష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రంగు. కార్తికేయ దర్శకుడు. పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయవాడకు చెందిన లారా అలియాస్ పవన్‌కుమార్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని లారా కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వారి అనుమానాల్ని నివృత్తి చేస్తూ చిత్ర బృందం బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దర్శకుడు మాట్లాడుతూ లారా కుటుంబాన్ని కించపరుస్తూ సినిమా తీయాలనే ఉద్దేశం మాకు లేదు. కుటుంబ సభ్యులు మా సినిమా చూస్తే లారా ఇంకా తమ మధ్యే తిరుగుతున్నాడని ఫీలవుతారు అన్నారు.

1349

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles