నాగిని ప్రతీకారం!

Sat,February 9, 2019 11:50 PM

జై, వరలక్ష్మి, కేథరిన్, లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం నీయ-2. ఎల్.సురేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగకన్య పేరుతో నిర్మాత ఎ.శ్రీధర్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ వరలక్ష్మి, లక్ష్మీరాయ్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌లను ఇటీవల విడుదల చేశాం. మంచి స్పందన లభించింది. ఆదివారం కేథరిన్ లుక్‌ను,11న టీజర్‌ను విడుదల చేస్తున్నాం. సరికొత్త నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. గ్రాఫిక్స్, జై పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఇదొక రొమాంటిక్ హారర్ థ్రిల్లర్. ఓ నాగిని ప్రతీకారం నేపథ్యంలో సినిమా సాగుతుంది. చిత్రాన్ని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అన్నారు.

2835
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles