ప్రతి రోజు కొత్తగా...


Sat,June 8, 2019 11:53 PM

tamannaah says about her career

ఒకే తరహా పాత్రలు చేస్తూ పోతే కొన్నాళ్లకు నటన పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. వృత్తి పరంగా వైవిధ్యతను కోరుకోవడమే కాకుండాప్రతి రోజును కొత్తగా ప్రారంభించాలని ఎదురుచూస్తుంటాను అని చెబుతున్నది తమన్నా. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలకు చేరువ అవుతున్నా చక్కటి అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది ఈ సొగసరి. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో వినూత్నమైన ఇతివృత్తాలతో ప్రతిభను చాటుకుంటున్నది. తన సినీ ప్రయాణాన్ని గురించి తమన్నా మాట్లాడుతూ అనుభవజ్ఞురాలిని, అన్ని తెలుసు అనే భావనతో ఎప్పుడూ ఆలోచించను. కొత్తగా సినీ ప్రయాణాన్ని ఆరంభిస్తున్నాననే భావనతో సెట్స్‌లో అడుగుపెడతాను. తెలియని అంశాలపై అవగాహన పెంచుకుంటూ నా నటనను నిరంతరం మెరుగుపరుచుకుంటాను.

ఎలాంటి భేషజాలు లేకుండా నూతన తారల్ని చూసి నా తప్పొప్పుల్ని సవరించుకుంటాను. అలా ఆలోచిస్తున్నాను కాబట్టే ఇన్నేళ్ల పాటు చిత్రసీమలో ఉండగలిగాను. నేనే నంబర్‌వన్, సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌నని అనుకుంటే నా ప్రయాణం ఎప్పుడో ఆగిపోయేది అని తెలిపింది. ఇటీవల ఎదురైనా పరాజయాల గురించి మాట్లాడుతూ పరాజయాలు ఎవరినైనా బాధిస్తాయి. అందుకు నేను అతీతమేమి కాదు. నా పాత్రకు న్యాయం చేశానా లేదా అని చూసుకుంటాను. ఆ సంతృప్తే నాకు ముఖ్యం అని చెబుతున్నది.

1555

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles