కబడ్డీ కోచ్‌ పాత్రలో..

Sat,September 28, 2019 12:04 AM

కమర్షియల్‌ హీరోయిన్‌ ముద్ర నుంచి దూరమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నది మిల్కీ బ్యూటీ తమన్నా. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లో విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ నటిగా వైవిధ్యతను చాటుకునేందుకు తపిస్తున్నది. తాజాగా ఆమె కబడ్డీ కోచ్‌గా సరికొత్త అవతారం ఎత్తబోతున్నట్లు తెలిసింది. గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నది. స్పోర్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో కథానాయికగా తమన్నాను చిత్రబృందం ఇటీవలే ఎంపికచేసింది. ఈ సినిమాలో తమన్నా మహిళా కబడ్డీ టీమ్‌ శిక్షకురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె పాత్ర ప్రయోగాత్మక పంథాలో భిన్నంగా సాగనున్నట్లు సమాచారం. కోచ్‌ పాత్ర కోసం ప్రస్తుతం కబడ్డీ ఆటకు సంబంధించిన మెళకువల్ని తెలుసుకునే ప్రయత్నాల్లో తమన్నా ఉన్నట్లు చెబుతున్నారు. ఆటకు సంబంధించి టెక్నిక్స్‌, పదాలతో పాటు శిక్షకురాలిగా కనిపించడానికి అవసరమైన బాడీలాంగ్వేజ్‌ కోసం తమన్నా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. గోపీచంద్‌, తమన్నా కలయికలో తొలిసారి రూపొందనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరలో సెట్స్‌పైకి రానున్నది.

478

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles