అదే మాటపై ఉన్నా!


Tue,March 19, 2019 12:01 AM

tamannaah bhatia says she was completely comfortable working with sajid khan mouni roys

ఒక నిర్ణయం తీసుకున్నానంటే ఎట్టిపరిస్థితుల్లోను దానికే కట్టుబడి ఉంటానని చెబుతున్నది మిల్కీబ్యూటీ తమన్నా. పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ముద్దు దృశ్యాల్లో అస్సలు నటించనని దర్శకనిర్మాతలకు షరతు పెట్టిందట ఈ పంజాబీ సోయగం. ఆ మాట ప్రకారమే పదిహేనేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు చుంబన దృశ్యాల్లో నటించలేదట. ఈ విషయమై తమన్నా మాట్లాడుతూ కిస్సింగ్ సీన్స్‌లో నటించొద్దని కెరీర్ ఆరంభంలోనే ధృడ నిశ్చయం తీసుకున్నాను. అందాల ప్రదర్శన చేయాలని, ముద్దు దృశ్యాల్లో నటించాలని చిత్రసీమలో ఎవరూ బలవంత పెట్టరు. ఏదైనా విషయం నచ్చకపోతే నిరభ్యంతరంగా మన అభిప్రాయాన్ని వెల్లడించవొచ్చు. మనకు ఇష్టం లేకపోతే ఆ సినిమా నుంచి తప్పుకోవచ్చు. కెరీర్ తొలినాళ్లలోనే ముద్దు దృశ్యాలకు సంబంధించి నా అభిప్రాయాన్ని చెప్పాను కాబట్టి ఎవరూ అలాంటి సీన్స్‌లో నటించమని కోరలేదు అని చెప్పింది. పెళ్లి గురించి మాట్లాడుతూ నేను విధిని నమ్ముతాను. పెళ్లి గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పెళ్లి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఆ సమయం కోసం వేచి చూడటమే మనం చేయాల్సింది అని తెలిపింది.

2308

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles