నెగెటివ్ షేడ్స్‌తో..

Sun,March 10, 2019 11:58 PM

ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన తమిళ చిత్రం దేవి. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ప్రస్తుతం దేవి-2 పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు విజయ్. ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నా ఆత్మలుగా కనిపించబోతున్నట్లు తెలిసింది. నెగెటివ్ షేడ్స్‌తో వీరి పాత్రలు విభిన్నంగా సాగనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. హారర్ కథాంశానికి సమకాలీన సమస్యను జోడించి దర్శకుడు విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రభుదేవా ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నందితాశ్వేత మరో కథానాయికగా కనిపిస్తున్నది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని అనువదించే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. కోవై సరళ, డింపుల్ హయాతి, ఆర్.జె. బాలాజీ, సతీష్, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు.

2625

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles