భయపెట్టడానికి సిద్ధం!


Sun,April 14, 2019 11:31 PM

tamanna in aanado brahma tamil remake movie

పంజాబీ సోయగం తమన్నా కెరీర్ జోరుగా సాగిపోతున్నది. తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నదీ సుందరి. వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ నటిగా తన ప్రతిభాపాటవాల్ని చాటాలని తపిస్తున్న ఈ అమ్మడు తాజాగా తమిళంలో ఓ హారర్‌కామెడీ సినిమాకు ఓకే చెప్పింది. వివరాల్లోకి వెళితే..తాప్సీ ప్రధాన పాత్రలో తెలుగులో రూపొందిన ఆనందోబ్రహ్మ చిత్రం చక్కటి విజయాన్ని సాధించింది. హారర్, కామెడీ, సెంటిమెంట్ అంశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో తమన్నా కథానాయికగా నటించనుందని సమాచారం. కథ నచ్చడంతో ఈ సినిమాలో భాగమవడానికి తమన్నా సుముఖంగా ఉందని చెబుతున్నారు. ఆనందోబ్రహ్మ చిత్రంలో దెయ్యం పాత్రలో నటించింది తాప్సీ. ఇప్పుడు అదే పాత్రను తమన్నా తమిళంలో పోషించనుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో సైరా నరసింహారెడ్డి దటీజ్ మహాలక్ష్మి చిత్రాల్లో నటిస్తున్నది. అభినేత్రి-2 త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

1793

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles