11 ఏళ్ల తర్వాత

Fri,March 22, 2019 12:03 AM

సుదీర్ఘ విరామం తర్వాత టబు తెలుగులో సినిమా చేయనుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. 2008లో వచ్చి పాండురంగడు తర్వాత తెలుగు సినిమాలకు దూరమైంది టబు. హిందీ సినిమాలపై దృష్టిసారిస్తున్న ఆమె పదకొండేళ్ల తర్వాత టాలీవుడ్‌లో రీఏంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నది. తండ్రీ కొడుకుల కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లిగా టబు కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది.

2418
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles