రివాల్వర్ దాదీగా తాప్సీ!


Sat,June 16, 2018 12:48 AM

Taapsee Pannu starts shooting for Badla praises director Sujoy Ghosh

taapsee
బాలీవుడ్‌లో జీవిత కథా చిత్రాల పరంపర కొనసాగుతూనే ఉంది. భిన్న రంగాల్లో సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల జీవితాల్ని వెండితెర దృశ్యమానం చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఢిల్లీ సొగసరి తాప్సీ ప్రముఖ మహిళా షూటర్ బయోపిక్‌లో నటించనుంది. ఉమేనియా అనే పేరుతో రూపొందించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అనురాగ్‌కశ్యప్ నిర్మించబోతున్నారు. తుషార్ హీరానందాని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రివాల్వర్ దాదీగా ప్రసిద్ధకెక్కిన చంద్రుతోమర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. చంద్రుతోమర్ పాత్రలో తాప్సీ నటించనుంది. దాదాపు 30ఏళ్ల క్రితం తన మనవరాలికి షూటింగ్‌లో శిక్షణ ఇప్పించేందుకు చంద్రుతోమర్ కొన్ని నెలల పాటు ఓ కోచింగ్ సెంటర్‌కు వెళ్తుంది. ఒకరోజు అనుకోకుండా పిస్టల్ తీసుకొని గురిచూసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అప్పటికే యాభై ఏళ్ల వయసున్న చంద్రుతోమర్ షూటింగ్ నైపుణ్యానికి ముగ్ధుడైన అక్కడి శిక్షకుడు మరింత ప్రావీణ్యం సంపాదించుకోవడానికి ఆమెను ప్రోత్సహిస్తాడు. అలా అనుకోకుండా షూటింగ్ క్రీడలోకి ప్రవేశించిన చంద్రుతోమర్ అసమాన ప్రతిభతో షూటింగ్‌లో 30సార్లు జాతీయ ఛాంపియన్‌షిప్ సాధించింది.

ప్రస్తుతం 86 సంవత్సరాల వయసున్న ఆమె ప్రపంచంలోనే వృద్ధ షూటర్‌గా పేరు సంపాదించుకుంది. చంద్రుతోమర్ స్ఫూర్తిదాయక జీవితాన్ని వెండితెరకెక్కించబోవడం బాలీవుడ్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బయోపిక్‌లో చంద్రుతోమర్ కోడలు ప్రకాష్‌తోమర్ జీవితాన్ని కూడా చూపించబోతున్నారు. ఆమె సైతం షూటర్‌గా జాతీయస్థాయిలో పేరుతెచ్చుకుంది. ఇద్దరు కథానాయికలు నటించనున్న ఈ చిత్రాన్ని త్వరలో సెట్స్‌మీదకు తీసుకెళ్లనున్నారు.

1705

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles