స్వయంవద ప్రతీకారం


Tue,April 16, 2019 11:41 PM

Swayamvada Movie Teaser relesed by Director A Kodandarami Reddy

ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా నటిస్తున్న చిత్రం స్వయంవద. వివేక్‌వర్మ దర్శకుడు. లక్ష్మీ చలన చిత్ర పతాకంపై రాజా దుర్వాసుల నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ సీనియర్ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ ఆసక్తికరంగా వుంది. హీరోయిన్ పాత్ర చిత్రణ బాగుంది. పేరున్న నటీనటులంతా కలిసి నటించిన ఈ సినిమా దర్శకుడు వివేక్‌వర్మకు మంచి పేరుతెచ్చిపెట్టాలి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ సెన్సార్ పూర్తయింది. యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ప్రతీకార నేపథ్య కథాంశంతో హారర్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేస్తున్నాం. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకముంది అని నిర్మాత తెలిపారు.

482

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles