రాజు తప్పు చేస్తే..


Mon,May 20, 2019 11:33 PM

Swarnasundari release on May 31

జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సువర్ణసుందరి. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది ఉపశీర్షిక. సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకుడు. ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్నారు. ఈ నెల 31న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయులతో ముచ్చటించింది. దర్శకుడు మాట్లాడుతూ సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశమిది. అరుంధతి, మగధీర, బాహుబలి తరహాలో వినూత్నంగా ఉంటుంది. కామెడీకి ఆస్కారం లేకుండా ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగుతుంది. ఆరు వందల ఏళ్ల క్రితం ఓ రాజు చేసిన తప్పు నేటి తరాన్ని ఎలా వెంటాడింది? ఓ విగ్రహానికి సంబంధించిన రహస్యమేమిటన్నది అలరిస్తుంది. దర్శకుడిగా నాకు సంతృప్తిని మిగిల్చింది అని తెలిపారు. మూడు కాలాల వ్యవధుల్లో సాగే కథ ఇదని, తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నామని నిర్మాత పేర్కొన్నారు. విజువల్‌గా, గ్రాఫికల్‌గా కన్నుల పండువగా ఉండే చిత్రమిదని సినిమాటోగ్రాఫర్ ఎలు మహంతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైట్‌మాస్టర్ రామ్ సుంకర పాల్గొన్నారు.

854

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles