రామకృష్ణగౌడ్‌కు డాక్టరేట్


Sat,June 16, 2018 12:26 AM

Swamy Goud And Roshaiah Has Honoured Rk Goud For Receiving The Doctorate

Rama-krishna-goud
తెలంగాణ ఫిలింఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్‌ను యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ చేతుల మీదుగా రామకృష్ణగౌడ్ డాక్టరేట్‌తో పాటు యాభై వేలనగదు పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికా కాలిఫోర్నియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీ అనుబంధ విద్యాసంస్థగా పనిచేస్తున్న యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ రామకృష్ణగౌడ్‌తో పాటు నటుడు సుమన్‌కు ఈ డాక్టరేట్‌లను అందజేసింది. చిన్న సినిమాల సంక్షేమం కోసం తెలంగాణ ఫిలింఛాంబర్ ద్వారా గత కొన్నేళ్లుగా కృషిచేస్తున్నారు రామకృష్ణగౌడ్.

796

More News

VIRAL NEWS