మా అందరికి స్ఫూర్తిప్రదాత ఎస్వీఆర్


Mon,June 10, 2019 12:11 AM

SV Ranga Rao Mahanatudu Book Launch By Megastar Chiranjeevi

ఎస్వీ రంగారావు నా ఆరాధ్య నటుడు. మా నాన్న ద్వారా ఎస్వీఆర్ గొప్పతనాన్ని గురించి తెలుసుకున్న తర్వాతే నాకు నటుడిని కావాలనే కోరిక మొదలైంది అని అన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి. ఫొటోల రూపంలో ఎస్వీ రంగారావు జీవితాన్ని ఆవిష్కరిస్తూ సంజయ్ కిషోర్ రూపొందించిన మహానటుడు పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో చిరంజీవి విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్వీఆర్ లాంటి గొప్ప వ్యక్తిపై వచ్చిన పుస్తకాన్ని విడుదల చేయడం భగవంతుడు ఇచ్చిన మహాద్భాగ్యంగా భావిస్తున్నాను. నటనలో ఆయనో ఎన్‌సైక్లోపీడియా. ఎస్వీఆర్ నటించిన జగత్ కిలాడీలు జగత్ జంత్రీలు సినిమాల్లో మా నాన్నచిన్న పాత్రలను పోషించారు. ఆ సినిమా చిత్రీకరణల విశేషాల్ని నాన్న మాతో పంచుకునేవారు. అలా ఎస్వీఆర్‌పై అభిమానం మొదలైంది. చరణ్ సినిమాల్లోకి వస్తాననగానే ఎస్వీ రంగారావు గారి సినిమాలు చూపించాను. ఆయన సహజ నటన నుంచి చరణ్ స్ఫూర్తి పొందాడు. మా అందరికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.

ఎస్వీఆర్ ఈ నేలపై పుట్టడం తెలుగువారి అదృష్టం. ఆయన్ని నేరుగా ఒక్కసారి కలవలేకపోయాను. ఫొటో కూడా తీయించుకోలేకపోయాననే బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అని తెలిపారు. నటనకు రూపమిస్తే అది ఎస్వీ రంగారావు అని బ్రహ్మానందం పేర్కొన్నారు. బాల్యం నుంచి ఎస్వీఆర్ జీవిత ప్రయాణాన్ని ఛాయాచిత్రాల రూపంలో ఈ పుస్తకంలో పొందుపరిచామని రచయిత సంజయ్ కిషోర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, రావికొండలరావు. రోజారమణి, జయలలిత తదితరులు పాల్గొన్నారు.

875

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles