వెంటాడే చరిత్ర


Sat,May 11, 2019 12:01 AM

Suvarna Sundari release our product in Telugu, Tamil, and Kannada on May 31

పూర్ణ, సాక్షిచౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సువర్ణసుందరి. సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకుడు. ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్‌ను జరుపుకుంటున్నది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశమిది. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది అనే క్యాప్షన్‌తో తెరకెక్కిస్తున్నాం. వీఎఫ్‌ఎక్స్ కోసం సంవత్సరం పాటు పనిచేశాం. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. ఈ నెలలోనే ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. నిర్మాత మాట్లాడుతూ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ నెల 31న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఓ దేవతా విగ్రహం చుట్టూ నడిచే కథాంశమిది. ఆద్యంతం థ్రిల్‌ని కలిగిస్తుంది అని చెప్పారు. రామ్ మద్దుకూరి, సాయికుమార్, కోటా శ్రీనివాసరావు, నాగినీడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎల్లుమహంతి, సంగీతం: సాయికార్తీక్, దర్శకత్వం: ఎం.ఎన్.ఎన్.సూర్య.

1046

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles