అతడితోనే ఏడడుగులు


Mon,February 11, 2019 12:12 AM

Sushant Singh Rajput and Kriti Sanon alleged love story

అబద్ధాలు శాశ్వతం కాదని, కాలగమనంలో కొన్ని రోజులకు వాటంతట అవే కనుమరుగైపోతుంటాయని అంటోంది కృతిసనన్. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కృతిసనన్ ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రాబ్త సినిమాలో నటిస్తున్న సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది. పలు వేడుకల్లో ఈ జంట సన్నిహితంగా కనిపించడం, విహారయాత్రలకు కలిసి వెళ్లడంతో డేటింగ్ చేస్తున్నది నిజమేనని అంతా అనుకున్నారు. అయితే సుశాంత్‌సింగ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని, తమ మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రేమగా భావించడం సరికాదని చెబుతున్నది కృతిసనన్. ఆమె మాట్లాడుతూ సుశాంత్‌తో నేను ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వార్తలు నా వరకు వచ్చాయి. సినీ పరిశ్రమలో ఇలాంటి గాసిప్స్ సహజంగా వినిపిస్తుంటాయి అందుకే వాటిని సీరియస్‌గా తీసుకోలేదు. మౌనంగా ఉంటే ప్రచారం చేస్తున్నవారే కొద్ది రోజులకు వాటిని ఆపేస్తారు. ఆ ఆలోచనతోనే నా కెరీర్‌పై దృష్టిసారించాను. డేటింగ్ సంస్కృతికి నేను వ్యతిరేకం. నా మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడితే అతడితోనే జీవితాన్ని పంచుతుంటాను.ఆ వ్యక్తి గుణగణాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఏడడుగులు వేస్తాను అని తెలిపింది.

2863

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles