రొమాంటిక్ థ్రిల్లర్

Thu,November 7, 2019 12:25 AM

సత్యప్రకాష్‌తో 12 ఏండ్లుగా పరిచయముంది. నాకు ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరు. కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ ఆయన రూపొందించిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి అని అన్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వం వహించిన చిత్రం ఊల్లాల ఊల్లాల. నటరాజ్, నూరిన్, అంకిత ప్రధాన పాత్రల్లో నటించారు. ఎ.గురురాజ్ నిర్మాత. చిత్ర ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో దర్శకుడు సురేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ హారర్, ప్రేమ, రొమాన్స్ హంగులు మిళితమైన వినోదాత్మక చిత్రమిది. నటరాజ్ కొత్తవాడైనా అనుభవజ్ఞుడిలా నటించారు. లవర్స్‌డేలో నటించిన నూరిన్‌ను ఈ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తున్నాం. అంకిత గ్లామర్, అభినయం ఆకట్టుకుంటాయి. త్వరలో ఆడియోను విడుదలచేస్తాం అని తెలిపారు. నటరాజ్ మాట్లాడుతూ నాన్న దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యప్రకాష్ పాల్గొన్నారు.

370

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles