నా మాటలు నిజమైనందుకు గర్వంగా వుంది!


Tue,May 14, 2019 01:15 AM

superstar maheshs 25th film titled maharishi

ప్రీరిలీజ్ వేడుకలో భావోద్వేగానికిలోనై మాట్లాడాను. కథపై వున్న నమ్మకమే ఆ రోజు నన్ను ఆలా మాట్లాడేలా చేసింది. దానిపై కొన్ని కామెంట్స్ కూడా విన్నాను. అయితే ఆ రోజు నేను ఏ నమ్మకంతో మాట్లాడానో అది ఈ రోజు నిజమైందుకు చాలా గర్వంగా వుంది అన్నారు దిల్ రాజు. సి.అశ్వనీదత్, పీవీపీతో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం మహర్షి. మహేష్‌బాబు కథానాయకుడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడులైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ మహేష్ 25వ చిత్రం ఎపిక్ బ్లాక్ బస్టర్ కావడం ఆనందాన్ని కలిగించింది.

వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన రైతులపై తీసిన సినిమా గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుతుంటే అమితానందాన్ని కలిగిస్తోంది. మేము ఊహించిందే ఈ రోజు నిజమైంది. వంశీ కథ చెప్పినప్పుడే ఇది ఓ క్లాసిక్ కాబోతుందని టీమ్‌తో పాటు మహేష్ నమ్మారు అని తెలిపారు. హీరో మహేష్‌బాబు మాట్లాడుతూ నా ఇరవై ఐదు చిత్రాల ప్రయాణం నాకు చాలా ప్రత్యేకమైనది. అందులో మహర్షి నాకు చాలా ప్రత్యేకం. నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడు సినిమా రిలీజ్ ముందు అమ్మదగ్గరికి వెళ్లి ఆమె చేతి కాఫీ తాగుతాను. అలా చేస్తే దేవుడి గుడిలో ప్రసాదం తిన్న అనుభూతి కలుగుతుంది. అమ్మ ఆశీర్వాదం నాకు చాలా ముఖ్యం. అందువల్లేనేమో ఈ చిత్రానికి ఇంత పెద్ద సక్సెస్ లభించింది. ఈ ఎపిక్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఈ మదర్స్ డే రోజున మదర్స్ అందరికి అంకితం చేస్తున్నాను.
Maharshi
మూడేళ్ల ప్రయాణంలో ఊహించని అనుభూతులున్నాయి. నేను కథ విన్నప్పుడు దిల్ రాజు ఫోన్ చేసి మీరు చెప్పినట్టే ఇదొక క్లాసిక్ అవుతుంది అన్నారాయన. అది విని చాలా ఆనందించాను. క్రికెట్‌కి వీరాభిమానిని నేను. 2011లో జరిగిన ఇండియా శ్రీలంక వరల్డ్‌కప్ మ్యాచ్ బాంబేలో చూశాను. చివరి బంతికి ధోనీ సిక్స్ కొట్టాడు. అప్పుడు ఎలాంటి అనుభూతికి లోనయ్యానో సినిమా డబుల్ పాజిటివ్ చూడగానే దిల్‌రాజు వచ్చి సిక్సర్ అన్నప్పుడు అదే అనుభూతి కలిగింది. ప్రీరిలీజ్ వేడుకలో అభిమానులు కాలర్ ఎగరేసేలా సినిమా వుంటుందని వంశీ మాటిచ్చారు. సినిమా చూసి అభిమానులే కాదు. నేనూ కాలర్ ఎగరేస్తున్నా. వారంలో ఈ సినిమా నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్‌ని దాటబోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సి. అశ్వనీదత్, అల్లరి నరేష్, దేవిశ్రీప్రసాద్, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, హరి, శ్రీమణి, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.

2582

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles