నటుడిగా సంతృప్తినిచ్చింది!


Fri,September 7, 2018 12:01 AM

Super Sketch Movie Villain Indra Interview

సూపర్‌స్కెచ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఓ పోలీస్ ఆఫీసర్, విదేశీ యువతి, నలుగురు నేరస్థుల మధ్య సాగే కథ. ఆ క్రిమినల్స్ కారణంగా పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరకు వారిని ఎలా పట్టుకోగలిగారన్నది ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు ఇంద్ర. ఆయన నటించిన తాజా చిత్రం సూపర్‌స్కెచ్. రవిచావలి దర్శకుడు. బలరామ్ మక్కల నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో నటుడు ఇంద్ర మాట్లాడుతూ మాది శంషాబాద్. అక్కడే పుట్టి పెరిగాను. నాన్న రైతు. వృత్తిరీత్యా మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌ని. దాదాపు 20 వేల మందికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను. సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం వల్లే రాజమౌళి రూపొందించిన సై సినిమాలో నటించాను. స్పోర్ట్స్ తెలిసిన వాళ్ల కోసం వెతుకుతున్నారని తెలిసి ప్రయత్నిస్తే సైలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత సైనికుడు, దత్తపుత్రుడు, కురుకురే, ధృవ వంటి చిత్రాల్లో చేశాను. తాజాగా నేను కీలక పాత్రలో ప్రతినాయకుడిగా నటించిన చిత్రం సూపర్‌స్కెచ్. ఓ పోలీస్ ఆఫీసర్‌కు, ఓ నావలిస్టుకు మధ్య మైండ్‌గేమ్ నేపథ్యంలో సాగుతుంది. నటుడిగా నన్ను సరికొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రమిది. ఓ సీన్‌లో హీరోగా, మరో సీన్‌లో విలన్‌గా.. ఇలా భిన్న పార్శాల్లో నా పాత్ర సాగుతుంది. ఈ చిత్రం నటుడిగా సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ప్రాధాన్యమున్న సైనికుడిగా కనిపిస్తాను. ఈ చిత్రం నాకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతుందన్న నమ్మకముంది అన్నారు.

1801

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles