వీరమహాదేవి రాజసం


Fri,May 18, 2018 10:57 PM

Sunny Leone looks regal in the first look of Telugu film Veermahadevi Movie

Sunnyleone
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వీరమహాదేవి. వి.సి. వడివుడయాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫోన్స్ స్టీఫెన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీలియోన్ ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో రణరంగానికి సన్నద్ధమైన పోరాట యోధురాలిగా శక్తివంతంగా సన్నీలియోన్ దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నాం. ఆయా భాషల నటీనటులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా కోసం సన్నీలియోన్ తెలుగు నేర్చుకుంటున్నారు.

దక్షిణాది సంప్రదాయాలకు అనుగుణంగా వినూత్న ఆహార్యంతో ఆమె పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది. ఆమె ధరించే దుస్తులను ముంబయిలో ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నాం. సన్నీలియోన్ ఈ సినిమా కోసం 150రోజుల పాటు డేట్స్ కేటాయించింది. రామోజీఫిలింసిటీ, కేరళ అడవులలో వేయి గుర్రాలు, ఏనుగులతో భారీ స్థాయిలో పోరాట ఘట్టాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గాడ్స్ ఆఫ్ ది ఈజిప్ట్ చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ను సమకూర్చుతున్నారు. గ్రాఫిక్స్ కోసమే 40 కోట్లు వ్యయం చేయనున్నాం అని తెలిపారు. సైన్యంతో బయలుదేరి కదనరంగంలో దూకడానికి సిద్ధంగా వున్న వీరనారిగా సన్నీలియోన్ లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నది. కథానాయికగా ఆమె నటిస్తున్న తొలి దక్షిణాది చిత్రమిదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలునెలకొని వున్నాయి. తన ఇమేజ్‌కు భిన్నంగా సన్నీలియోన్ చారిత్రక చిత్రంలో నటిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

2710

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles