బాలీవుడ్‌కు ఆర్‌ఎక్స్ 100


Sat,November 17, 2018 10:44 PM

Suniel Shetty son Ahan Shetty to mark his Bollywood debut with this film

తెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రాల్ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అర్జున్‌రెడ్డి బాలీవుడ్‌లో కబీర్‌సింగ్ పేరుతో రీమేక్ అవుతోంది. ఈ జాబితాలోనే ఆర్‌ఎక్స్ 100 చిత్రం కూడా బాలీవుడ్‌కు వెళుతోంది. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో అశోక్ గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా హిందీ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్న నిర్మాత సాజిద్ నదియావాలా త్వరలో మిలన్ లూథ్రియా దర్శకత్వంలో సెట్స్‌పైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ద్వారా హీరో సునీల్‌శెట్టి తనయుడు అహన్ శెట్టిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు తెలిసింది.

1998

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles