లాయర్ కహానీ..


Wed,May 8, 2019 11:39 PM

sundeep kishans s tenali ramakrishna ba bl movie first look

సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్. కేసులు ఇవ్వండి ప్లీజ్ ఉపశీర్షిక. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. శ్రీనీలకంఠ స్వామి క్రియేషన్స్ పతాకంపై నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, రూపాజగదీష్ నిర్మిస్తున్నారు. హన్సిక, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయికలు. సోమవారం సందీప్‌కిషన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సందీప్‌కిషన్ లాయర్ పాత్రలో కనిపిస్తాడు. సంపూర్ణహాస్యభరిత చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. ఓ లాయర్ వృత్తిపరంగా ఎదుర్కొనే సవాళ్లను వినోదాత్మకంగా ఆవిష్కరిస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ చిత్రీకరణ మొదలుపెట్టాం అని చిత్రబృందం తెలిపింది. మురళీశర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వి, రఘుబాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: టి.రాజసింహ, స్క్రీన్‌ప్లే: రాజు, గోపాలకృష్ణ, సంభాషణలు: నివాస్, భవానీప్రసాద్, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

965

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles