కర్నూల్‌లో తెనాలి రామకృష్ణ

Thu,February 7, 2019 11:31 PM

సందీప్‌కిషన్, హన్సిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బీఏబీఎల్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్‌ను గురువారం కర్నూల్‌లో మొదలుపెట్టారు. నాయకానాయికలు సందీప్‌కిషన్, హన్సికపై ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. సంపూర్ణ హాస్యరసభరిత చిత్రంగా తెరకెక్కిస్తున్నామని, ప్రేక్షకులకు ఆద్యంతం చక్కటి వినోదాన్ని పంచుతుందని చిత్ర బృందం తెలిపింది. సందీప్‌కిషన్ పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. మురళీశర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాతలు: ఆగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, సంస్థ: శ్రీ నీలకంటేశ్వర స్వామి క్రియేషన్స్.

1740

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles