మా నమ్మకం నిజమైంది!


Thu,December 14, 2017 11:37 PM

Sumanths Malli Raava Movie Success Meet

sumanth
మళ్లీ రావా చిత్రంలో నటించినందుకు చాలా సంతృప్తిగా వున్నాను. కథ బాగా నచ్చింది కనుకే నమ్మి చేశాను. సినిమా విజయంతో మా నమ్మకం నిజమైంది అన్నారు సుమంత్. ఆయన నటించిన తాజా చిత్రం మళ్లీ రావా. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఆకాంక్షసింగ్ కథానాయిక. రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ నిర్మాత రాహుల్ చక్కని ప్లానింగ్‌తో సక్సెస్‌ని సాధించి చూపించాడు. అతని ప్లానింగ్ నచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నా సోదరి ఫోన్ చేసి అతన్ని అభినందించడం ఆనందంగా వుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ సినిమాను ఎంత నమ్మామో అంతకు మించి ఫలితం దక్కినందుకు ఆనందంగా వుంది. టీమ్ అంతా సొంత సినిమాలా భావించి శ్రమించారు. సినిమాకు మంచి పేరొస్తున్నందుకు గర్వంగా వుంది అన్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతీ ఒక్కరు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఇది టీమ్ సక్సెస్‌గా భావిస్తున్నాను అని గౌతమ్ తిన్ననూరి తెలిపారు. అనంతరం చిత్ర బృందానికి మధుర శ్రీధర్‌రెడ్డి జ్ఞాపికల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మిర్చి కిరణ్, మాస్టర్ సాత్విక్, అన్నపూర్ణ, రాజేష్, అనిత తదితరులు పాల్గొన్నారు.

607

More News

VIRAL NEWS