శివ రామచంద్రవరపు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సూసైడ్ క్లబ్'. శ్రీనివాస్ బొగడపాటి దర్శకుడు. 3 ఐ ఫిలిమ్స్‌తో కలిసి ప్రవీణ్ ప్రభు, వెంకటేశం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. గురువారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘నిజజీవితంలో నేను చూసిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన చిత్రమిది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుంది. సూసైడ్ క్లబ్లో ఏం జరిగిందన్నది ఆసక్తిని పంచుతుంది. శివ, వెంకట్, చందన పాత్రలు ఆకట్టుకున్నాయి. త్వరలో సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందించామని, ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం నవ్యమైన అనుభూతిని పంచుతుందని శివ అన్నారు. ప్రవీణ్ యండమూరి, చందన, సందీప్‌రెడ్డి, వెంకటకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు.