నిశ్చితార్థం జరిగింది!

Wed,January 16, 2019 11:31 PM

రానాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం లీడర్. ఇదే చిత్రంతో పరిచయమైంది ఢిల్లీ సోయగం రిచా గంగోపాధ్యాయ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రిచా తెలుగు, తమిళ, బెంగాళీ భాషల్లో దాదాపు తొమ్మిది చిత్రాల్లో నటించింది. 2013లో నాగార్జున హీరోగా నటించిన భాయ్ తరువాత కొంత విరామం తీసుకున్న ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయింది. ఆ తరువాత నుంచి సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్న రిచా తాజాగా ట్విట్టర్ ద్వారా తన పెళ్లి వార్తను వెల్లడించింది. బిజినెస్ స్కూల్‌లో పరిచయమైన జోయ్ అనే వ్యక్తితో తన నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించి తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. అయితే ఇంకా పెళ్లి తేదీని ఖరారు చేయలేదని, నా జీవితంలో కొత్త దశ మొదలు కాబోతోందని, దాని కోసం అంతులేని ఆనందంతో ఎదురుచూస్తున్నాని తెలిపింది.

1930

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles