చంద్రశేఖర్ ఏలేటి చిత్రంలో..


Mon,June 10, 2019 12:07 AM

sriya as mother in tollywood movie

పెళ్లి తరువాత సమంత సినిమాల ఎంపికలో తన పంథా మార్చుకుంది. వరుసగా విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటోంది. తాజాగా సమంత తరహాలోనే కొత్త తరహా చిత్రాలకు శ్రియ సిద్ధమవుతోంది. గత ఏడాది రష్యాకు చెందిన ఆండ్రూ కోస్చీవ్‌ని పెళ్లాడిన శ్రియ తెలుగులో మరే చిత్రాన్ని అంగీకరించలేదు. తాజాగా చంద్రశేఖర్ ఏలేటి చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. కొత్త తరహా చిత్రాల్ని అందించే దర్శకుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న చంద్రశేఖర్ ఏలేటి ఇటీవలే శ్రియకు మహిళా ప్రధాన ఇతివృత్తంతో సాగే స్టోరీ వినిపించారని, ఆయన చెప్పిన కథ విభిన్నంగా వుండటంతో ఇందులో నటించడానికి శ్రియ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సినిమాలో శ్రియ 10 ఏళ్ల పిల్లాడికి తల్లిగా కనిపించనుందని, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఓ మహిళగా ఆమె పాత్ర చాలా శక్తివంతంగా సాగుతుందని తెలిసింది. నితిన్ హీరోగా తొలుత ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని చంద్రశేఖర్ ఏలేటి ప్లాన్ చేసుకున్నారు. అయితే నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయిన తరువాతే చంద్రశేఖర్ ఏలేటి సినిమా చేయాలనుకున్నారట. దీంతో అంత సమయం ఎదురుచూడలేక మహిళా ప్రధాన చిత్రాన్ని తెరకెక్కించడానికి చంద్రశేఖర్ ఏలేటి సిద్ధమైనట్లు తెలిసింది.

1021

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles