శీను వేణు సాహసగాథ

Sat,October 5, 2019 12:02 AM

అభిషేక్, ప్రజ్వల్‌కుమార్, మధుప్రియ, పూజిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం శీను వేణు. వీళ్లు మంచి కిడ్నాపర్స్ ఉపశీర్షిక. వసుంధర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి ములకలపల్లి దర్శకుడు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్ర గీతాలు విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ వినూత్న కథాంశాలతో రూపొందిన చిన్నచిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.ఈ సినిమాలో పాటలు బాగున్నాయి.నూతన తారాగణం చక్కటి నటనను కనబరిచారు అని అన్నారు.దర్శకుడు మాట్లాడుతూ పల్లెటూరి నేపథ్య చిత్రమిది.అపహరణకు గురైన ఇద్దరు అమ్మాయిల్ని శీను, వేణు అనే స్నేహితులు ఎలా రక్షించారన్నది ఉత్కంఠను పంచుతుంది.వినోదం, ప్రేమ,యాక్షన్, భావోద్వేగాల సమాహారంగా ఉంటుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, విద్యావేత్త రాజు తదితరులు పాల్గొన్నారు.

328

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles