శ్రీకరం శుభకరం నారాయణీయం


Thu,October 12, 2017 11:49 PM

srikaram
గోదా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న శ్రీకరం శుభకరం నారాయణీయం చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. స్వీయనిర్మాణ దర్శకత్వంలో వానమామలై కృష్ణదేవ్ రూపొందిస్తున్నారు. ప్రశాంత్ నిమ్మని, ఐంద్రిల్లా చక్రవర్తి జంటగా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సముద్రాల వేణగోపాలచారి క్లాప్‌నివ్వగా, శ్రీమతి మధు కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ మన దైనందిన జీవితంలో దైవం యొక్క విశిష్టతను తెలియజెప్పే చిత్రమిది. నేటి యువత తగినంత ఆధ్యాత్మిక చింతన లోపించడం వల్ల పెడదారి పడుతున్నారు. సమాజ శ్రేయస్సు కోసం వారు సన్మార్గంలో పయనించాలనే సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. నవంబర్ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి జనవరిలోగా చిత్రీకరణ పూర్తిచేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. నేటి సమాజంలోని పెడధోరణులకు యువత కారణమవుతున్నది. వారి ఆలోచనా విధానం మారాలనే గొప్ప సందేశం వున్న సినిమా ఇది అని సముద్రాల వేణగోపాలచారి చెప్పారు. ఉదాత్త కథా చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నామని నాయకానాయికలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలుంటాయని సంగీత దర్శకుడు తారక రామారావు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లేష్ నాయుడు, సాహిత్యం: మధు ఫలం, రాజు, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: వానమామలై కృష్ణదేవ్.

655

More News

VIRAL NEWS