మార్షల్ సందేశం!


Wed,February 13, 2019 11:50 PM

Srikanth to play a powerful role in Marshal

శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మార్షల్. అభయ్ హీరోగా పరిచయమవుతున్నారు. జైరాజసింగ్ దర్శకుడు. మేఘా చౌదరి, రష్మి సమాంగ్ కథానాయికలు. ఏవిఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై అభయ్ అడక నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దర్శకుడు మాట్లాడుతూ సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో వున్నాయి. హీరో శ్రీకాంత్ పాత్ర సినిమాకు కీలకం. కొత్త తరహా పాత్రలో ఆయన కనిపిస్తారు. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్. వినోదంతో పాటు మంచి సందేశం వుంటుంది. ఈ సినిమా ద్వారా అభయ్ అడక హీరోగా పరిచయమవుతున్నారు. తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని నిర్మాత తెలిపారు.

664

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles