చిన్న సినిమాల్ని ఆదరించాలి


Sun,May 5, 2019 11:41 PM

srikanth talasani srinivas yadav marshal movie teaser launched

ఔత్సాహిక నటీనటులు, సాంకేతిక నిపుణులకు తెలంగాణ ప్రభుత్వం సహాయసహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దేశంలో అవుట్‌డోర్, ఇండోర్ షూటింగ్‌లకు హైదరాబాద్ తలమానికంగా నిలుస్తుంది. దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, సరస్సులతో పాటు ఎన్నో అందమైన ప్రదేశాలతో హైదరాబాద్ అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది అని అన్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. అభయ్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం మార్షల్. జై రాజా సింగ్ దర్శకుడు. శ్రీకాంత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మేఘాచౌదరి కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ హీరోగా అభయ్‌కి ఇదే తొలి చిత్రమైనా ఎంతో అనుభవజ్ఞుడిగా నటించారు. టీజర్ చూస్తుంటే 100 శాతం సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది. కొత్తవారు సినీ పరిశ్రమలోకి రావాలి. వారిని ఇండస్ట్రీ అక్కున చేర్చుకొని ఆదరించాలి. చిన్న సినిమాలను ఆదరించాల్సిన అవసరం చాలా ఉంది అని తెలిపారు. మెడికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిదని, శ్రీకాంత్ పాత్ర కొత్త పంథాలో సాగుతుందని హీరో అభయ్ చెప్పారు.

1084

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles